Cancel Preloader

జార్ఖండ్‌ లో బీజేపీకి షాక్

 జార్ఖండ్‌ లో బీజేపీకి షాక్

Do Andhras need visa to stay in Telangana?

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇటీవల విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తాజా ఫలితాల్లో గల్లంతయ్యాయి. ఆ రాష్ట్ర ప్రజలు మళ్లీ హేమంత్ సోరెన్(జేఎంఎం) నేతృత్వంలోని ఇండియా కూటమికే పట్టం కట్టారు.

దీంతో ఎలాగైనా అక్కడ అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న కమలనాథుల ఆశలు అడియాశలయ్యాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఇప్పటి వరకు ఉన్న కౌంటింగ్ ట్రెండ్స్ మేరకు మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 50 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

అక్కడ మ్యాజిక్ ఫిగర్ 41 గా ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థులు 29 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  లేటెస్ట్ ట్రెండ్స్ మేరకు జార్ఖండ్‌లో మళ్లీ హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఏర్పడే అవకాశముంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *