మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి జోరు..?
మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి జోరును కొనసాగిస్తుంది. ఈరోజు ఉదయం నుండి వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి మెజార్టీ మార్కును దాటింది.
మహారాష్ట్రలో కోప్రీలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ కూటమి మొత్తం 217, కాంగ్రెస్ కూటమి 56స్థానాల్లో ఇతరులు పద్నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
ఎన్నికల ఫలితాల్లో ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న తరుణంలో పడ్నవీస్ నివాసంలో కూటమి నేతలు సమావేశం కానున్నరు. ఈ సమావేశానికి బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు.