మహారాష్ట్ర లో 1995తర్వాత అత్యధికంగా పోలింగ్ నమోదు..!
మహారాష్ట్రలో ఉన్న 288 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన పోలింగ్ శాతం 1995తర్వాత అత్యధికంగా నమోదైంది. మొత్తం పోలింగ్ శాతం 65.1% గా నమోదైందని ఎన్నికల కమిషన్ తెలిపింది.
1995లో రికార్డు స్థాయిలో అంటే ఏకంగా పోలింగ్ శాతం 71.5% గా నమోదైంది. ఎక్కువమంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం వల్ల తమకే అనుకూలం అని ఆయా రాజకీయ పార్టీలు చెబుతున్నాయి.
అయితే తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ కూటమికే అనుకూలంగా ఉన్నాయి. ఈ నెల ఇరవై మూడో తారీఖున ఫలితాలు వెలువడనున్నాయి.