హరియాణా ఫలితాలు రాహుల్ కి గుణపాఠం..?
సహాజంగా ఐదేండ్లు పరిపాలనలో ఉంటేనే సదరు అధికార పార్టీపై అంతోకొంత వ్యతిరేకత ఉంటుంది. అలాంటిది పదేండ్లు అధికారంలో ఉంటే కనీసం ముప్పై నుండి నలబై శాతం వరకు వ్యతిరేకత ఉంటుంది. ఈ ముప్పై నలబై శాతానికి ఇంకో పది ఇరవై శాతం కష్టపడితే అప్పటివరకు ప్రతిపక్షంగా ఉన్న పార్టీ అధికారంలోకి రావడానికి పెద్దగా ఇబ్బందులేమి ఉండవు. అయితే హరియాణాలో పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నది ఆ పార్టీ నేతలే కాదు ఎన్నో సర్వే సంస్థలు వెల్లడించిన నివేదికల్లో తేటతెల్లమైంది. కానీ అందివచ్చిన అవకాశాన్ని అందుకోవడంలో తీవ్రంగా విఫలమయ్యారు కాంగ్రెస్ పార్టీ భావి ప్రధానమంత్రి అభ్యర్థి.. ఆ పార్టీ ఆశాకిరణం రాహుల్ గాంధీ.
హరియాణా ఎన్నికల సమయంలో తమ మిత్రపక్షమైన ఆప్ పార్టీ తమకు పది సీట్లు ఇవ్వాలని పట్టుబట్టింది.పోనీ ఐదు సీట్లైన ఇవ్వాలని భీష్మించు కూర్చుంది. అయిన కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వం వినలేదు.. అఖరికి మూడు సీట్లిస్తామని.. కావాలంటే కల్సిపోటి చేస్తామని హూకుం జారీ చేసింది కాంగ్రెస్ .. దీంతో ఆప్ సొంతగా బరిలోకి దిగింది. అప్పటి వరకు ఆ పార్టీలో ఉన్న సొంతకుంపటి సమస్యలను సైతం పరిష్కరించడంలో రాహుల్ గాంధీ విఫలమయ్యారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమవైపు తిప్పుకోవడంలోనూ కాంగ్రెస్ నాయకత్వం ఫెయిల్యూరైంది.
దాదాపు ఎనబై రెండు ఏండ్లున్న మల్లిఖార్జున ఖర్గే హరియాణాలో పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహాం నింపడంలో విఫలమయ్యారు. యువకుడైన రాహుల్ గాంధీ ఆబాధ్యతలను తలనెత్తుకోవడంలో వెనకడుగు వేశారు. ఆప్ తో సయోధ్య కుదుర్చుకోని కల్సి పోటి చేసి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవి అని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఎందుకంటే బీజేపీ కి వచ్చిన ఓట్ల శాతం కేవలం 39.94%, అదే కాంగ్రెస్ కు 39.09%.. మరోవైపు ఆప్ కు వచ్చిన ఓట్ల శాతం 1.90% అంటే కాంగ్రెస్ గెలుపు అవకాశాలకు అంతో ఇంతో గండికొట్టింది ఆప్ పార్టీనే అని ఇక్కడ క్లియర్ కట్. కల్సిపోటి చేయలేదు కాబట్టి వ్యతిరేక ఓటు బ్యాంకు చీలింది.
అదే కల్సి చేసి ఉంటే ఒకే పార్టీగుర్తుకు పడేది కదా. మరోవైపు హరియాణాతో పాటు ఎన్నికలు జరిగిన జమ్ము కాశ్మీర్ లో కాంగ్రెస్ గెలిచింది కంటే తమ మిత్రపక్షమైన ఎన్సీపీ గెలిచిందనడమే అత్యుత్తమమం. అంటే కాంగ్రెస్ కూడా ఇక్కడ పెద్దగా వలగబెట్టింది ఏమి లేదన్నట్లు. గత లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో తమకు అనుకూలంగా ప్రజలు తీర్పునివ్వడంతో రాహుల్ గాంధీ & టీమ్ కొద్దిగా రిలాక్స్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికైన పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీ తీసుకోకపోతే.. శ్రేణుల్లో సమరోత్సాహాం నింపకపోతే కాంగ్రెస్ పార్టీ మరో బుర్జువా పార్టీగా చరిత్రలో మిగిలిపోవడం ఖాయం.