అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ హీరో కొడుకు

India Loss The Match
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయిన పాలిటిక్స్ లో అయిన తండ్రి పేరో.. తాత పేరో వాడుకుని స్టార్ లైన వారున్న ఈ రోజుల్లో తన తండ్రి మాస్ మహారాజ్.. సీనియర్ స్టార్ హీరో.. అయితేనేమి అందరిలెక్క తాను హీరోగానో ఎంట్రీవ్వాలనుకోలేదు..
తన తండ్రి సినీ కేరీర్ ఎలా మొదలైందో తన సినీ కేరీర్ అలానే మొదలవ్వాలనుకున్నాడు. అంతే అసిస్టెంట్ డైరెక్టర్ గా అవతారమెత్తాడు. అసలు విషయానికి వస్తే మాస్ మహారాజ్ రవితేజ తనయుడైన మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా అవతారమెత్తనున్నాడు.
ఈ క్రమంలో మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంఫా స్పిరిట్ మూవీకోసం మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయనున్నట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. రవితేజ తనయ మోక్షద కూడా నిర్మాతగా మారేందుకు సితార ఎంటర్ ట్రైన్మెంట్స్ లో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.