తప్పు చేయాలె..! దీక్షకు దిగాలె..?-ఏపీ రాజకీయాల్లో నయా ట్రెండ్ .
ఏపీ పాలిటిక్స్ లో డిప్యూటీ సీఎం…. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నయా ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు.. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ తో పాటు దేశ రాజకీయాల్లో హాట్ టాఫిక్ అయిన తిరుపతి లడ్డూ వివాదంలో గత వైసీపీ ప్రభుత్వం అపచారానికి పాల్పడింది.. తిరుపతి ప్రతిష్టతను దిగజార్చారు అని ఏకంగా పదకొండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు. అంటే వీరి ఉద్ధేశ్యం ప్రకారం వైసీపీ తప్పు చేసింది కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకోవాలంటే జనసేన దీక్ష చేయాలన్నమాట.
మరోవైపు పవన్ బాటలో నడుస్తున్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే .. జనసేన నాయకులు పంతం నానాజీ..కాకినాడ రూరల్ లో జరిగిన సంఘటనలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ డాక్టర్ ను అసభ్య పదజాలంతో దూషించారు.. అక్కడితో ఆగకుండా సదరు డాక్టర్ ను అందరి ముందే అత్యంత అవమానక పరిస్థితుల్లో అవమానించారు. దీంతో డాక్టర్ యూనియన్ సదరు ఎమ్మెల్యే తమకు క్షమాపణలు చెప్పాలి.. ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఇటు దళిత సంఘాలు.. అటు వైద్యుల సంఘాలు ధర్నాలకు దిగాయి.
దీంతో నానాజీ ఏకంగా ఈరోజు సోమవారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రాయశ్చిత్త దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. అంటే తప్పు చేయాలి.. తప్పు చేసినట్లు ఒప్పుకోవాలి.. దానికి ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని ఏపీ ప్రజలకు ఇటు రాజకీయ వర్గాలకు సందేశమిస్తున్నట్లు ఆర్ధమవుతుంది.. రాజకీయాల్లో ఈ ట్రెండ్ ఎక్కడది.. ఇదే కొనసాగితే రేపు హత్యనో.. ఇంకా మర్డర్ నో చేసి తప్పు అయిందని ఒప్పుకోని ఇలాంటి దీక్షలు చేయచ్చా…?. పదవుల్లో అధికారంలో ఉండి మీరు సామాన్యులకు ఎలాంటి సందేశాలు ఇస్తున్నారు అని ఇటు రాజకీయ వర్గాలు అటు సామాన్యులు,మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైన ఇలాంటివి కాకుండా తప్పు చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.