వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు షాక్

 వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు షాక్

Thota Trimurthulu Member of the Andhra Pradesh Legislative Council

11 total views , 1 views today

ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు షాక్‌ తగిలింది.కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెంలో ఆయన అధీనంలో ఉన్న సీలింగ్‌ భూమిని ఎట్టకేలకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పోలీసుల సమక్షంలో కాకినాడ ఆర్డీవో ఆ భూముల్లో అక్రమ రొయ్యల చెరువులను ధ్వంసం చేశారు.

అక్కడ ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. త్రిమూర్తులు 2005లో తన కుటుంబ సభ్యుల పేరున సీలింగ్‌ భూములు కొనుగోలు చేశారు. ఆ భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులు పలుమార్లు షోకాజ్‌ నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు.

ఈ విషయం కోర్టు వరకూ వెళ్లింది. ఇటీవల న్యాయస్థానం నుంచి అధికారులకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో సీలింగ్‌ భూములను ప్రభుత్వానికి దఖలు పర్చాల్సిందేనంటూ కాకినాడ ఆర్డీవో ఈ నెల 19న తోట వేసిన పిటిషన్‌ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఆ భూములను శనివారం స్వాధీనం చేసుకున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400