చంద్రబాబు బెదిరింపులు

Chandrababu Naidu Chief Minister of Andhra Pradesh
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెదిరింపులతో టీటీడీ ఈవో మాట మార్చారు అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని రాజకీయంగా అంతమొందించడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.
తిరుపతి లడ్డూ వివాదంపై దమ్ముంటే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేయించాలని చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు. నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసి ఉండోచ్చని ముందు గతంలో ఈవో చెప్పారు. కానీ చంద్రబాబు ఈవోను బెదిరించారు.
దీంతో ఆయన మాట మార్చారు. 2014-19 మధ్యలో టీటీడీ లో నందిని నెయ్యి ఎందుకు వాడలేదు అని ఆయన ప్రశ్నించారు. కలుషితమైంది నెయ్యి కాదు.. చంద్రబాబు మానసిక స్థితి అని ఆయన హేద్దేవా చేశారు.