జానీ మాస్టర్ పై హీరోయిన్ సంచలన ఆరోపణలు

Jani Master
జానీ మాస్టర్ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది.. నిన్న ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో జానీ మాస్టర్ సతీమణి ఆయేషా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి మాధవీ లత సంచలన ఆరోపణలు చేశారు.
ఓ వీడియోను విడుదల చేసిన మాధవీ లత ఆ వీడియో లో మాట్లాడుతూ ” జానీ మాస్టర్ తో ఆ అమ్మాయి పదిహేడేండ్ల వయసులోనే ఆరు నెలలు పాటు రిలేషన్ షిప్ లో ఉంది.. ఆ తర్వాత బయటకొచ్చి తన పని తాను చేసుకుంటుంది. ఇప్పుడు ఆమె వయసు ఇరవై రెండు ఏండ్లు..
ఆమె పుష్ప – 2 మూవీలో ఓ పాట చిత్రీకరణ సమయంలో ఉండగా జానీ మాస్టర్ అక్కడకు వచ్చాడు.. ఆమెతో గొడవపడ్డాడు. దీంతో ఆ సినిమా దర్శకుడు సుకుమార్ పంచాయితీ పెట్టారు. మరో యువహీరో విశ్వక్ సేన్ మూవీ షూటింగ్ సమయంలోనూ ఇలాగే జానీ ఆమెను కొట్టాడు. మిస్ యూ అంటూ మెసేజ్ లు పెట్టేవాడు” అని ఆ వీడియోలో తెలిపింది.