జ”గన్” నీలో ఆ ‘ఒక్కటి’ మిస్ అయిందబ్బా…?
వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అంటే భయానికే మీనింగ్ తెల్వని బ్లడ్ అతని సొంతం.. కోట్లాది మంది అభిమానుల ప్రియతమ నాయకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజన్న ముద్దుబిడ్డ… మాట ఇస్తే మడెమ తిప్పని నాయకుడు. చుట్టూ శత్రువులు చుట్టిముట్టిన తొణకని ధైర్యం అతడిది.. మాటలు మాట్లాడితే ఫైరే తప్పా మిస్ ఫైర్ ఉండదు. అలాంటి నాయకుడు ప్రస్తుతం జగన్ లో మిస్ అయిందా..?. మునుపటి ఫైర్ ఇప్పుడు లేదా..?. జగన్ లో మిస్ అయిన ఆ ఒక్కటి ఏమిటి..?. ఇప్పుడు చూద్దాం..?
తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో కొన్ని వేల మంది ప్రాణాలను కోల్పోయారు.. వారిని ఓదార్చడానికి జగన్ చేసిన ఓదార్పు యాత్ర ఆయన పొలిటీకల్ కేరీర్ లోనే సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. అప్పటీ నుండి 2019లో అధికారంలోకి వచ్చేవరకు జగన్ ఎదుర్కున్న కష్టాలు.. అవమానాలు.. సమస్యలు… బయటపడిన కుట్రలు కుతంత్రాలు అన్ని ఇన్నీ కావు.. ఒకానోక టైంలో జగన్ ఇవన్నీ తట్టుకోగలడా అనే స్థాయి దగ్గర నుండి నూట యాబై ఒక్క అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే స్థాయికి ఎదిగారు జగన్ .
అలాంటి జగన్ ఇటీవల అధికారం కోల్పోయిన తర్వాత పాత జగన్ లో ఉన్న ఫైర్ మిస్ అయిందని అందరూ భావిస్తున్నారు.. ఈరోజుల్లో అయ్యా నాన్న అమ్మ అంటే వినే స్థాయిలో ఎవరూ లేరు. ఎవరైన క్లా స్ సినిమాలకంటే మాస్ సినిమాలనే ఎక్కువగా ఇష్టపడతారు.. నేటి రాజకీయాల్లో గాంధీజీ లెక్క ఉంటే సరిపోదు.. సుభాష్ చంద్రబోస్ లెక్క అగ్రెసీవ్ గా ఉంటేనే నెగ్గుకురాగలం అని రాజకీయ విమర్శకులు చెబుతుంటారు.. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి బాబు & టీమ్ ఎంత సేపు జగన్ అవినీతికి పాల్పడ్డాడు.. మంత్రులు కోట్లాది రూపాయలను తిన్నారు.. ఐదేండ్ల పాలనలో ఆంధ్రా ఆగమైంది అని తన అనుకూల మీడియా ద్వారా ప్రచారమే తప్పించి గత వంద రోజులుగా బాబు ప్రభుత్వం చేసింది సున్నా అని వైసీపీ శ్రేణులు వాదన.
తాజాగా రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టిస్తున్న వివాదం తిరుపతి లడ్డూ వివాదం.. ఈ విషయం వెలుగులోకి రాగానే వైఎస్ జగన్ మీడియా సమావేశం పెట్టి ఎప్పటిలాగే బాబు మత రాజకీయాలు చేస్తున్నారు.. కుల రాజకీయాలు చేసిన ఆయనకు మత రాజకీయాలు పెద్ద లెక్కన.. ఇది నిజం అని ప్రూవ్ చేయాలి. లేకపోతే తమ పదవులకు రాజీనామా చేయాలని రోటీన్ గా చేసేదే జగన్ ఇప్పుడు చేశాడు. జగన్ చేయాల్సింది ఇంకొకటి ఉంది. అదే బాబు ఏ దేవుడ్ని అయితే అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారో అదే దేవుడి సమక్షంలో ప్రమాణం చేసి తమ హాయాంలో లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదు.. కలిస్తే దేనికైన సిద్ధమని ప్రమాణం చేయాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సూచించినట్లుగా చేస్తే ఏపీ రాజకీయాల్లో జగన్ సునామీ సృష్టించినట్లవుతుంది.
ఎందుకంటే జగన్ ప్రెస్ మీట్ తర్వాత తిరుపతికి నెయ్యిని సరఫరా చేసే సంస్థ మేము శాంపిల్స్ పంపింది ఇప్పటి కూటమి ప్రభుత్వం హాయాంలో.. గత ప్రభుత్వ హాయాంలో ఎలాంటి తప్పులు జరగలేదని చెబుతున్న కానీ బాబు అనుకూల మీడియా దానికి విరుద్ధంగా ప్రచారంలో ముందుంది.. దీంతో జగన్ చెప్పిన మాటలు.. ఆ సంస్థ చెప్పిన నిజాలను పక్కనెట్టి బాబు & బ్యాచ్ చేస్తున్న ప్రచారాన్ని నమ్ముతున్నారు.. అందుకే జగన్ అగ్రెసీవ్ గా వెళ్లి అక్కడ ప్రమాణం చేసి తాను ఏ తప్పు చేయలేదని జనాలు గ్రహిస్తారు… దీంతో బాబు & బ్యాచ్ సెల్ఫ్ గోల్ లో పడతారు.. జగన్ పై ఉన్న హిందు వ్యతిరేకి అనే ముద్ర కూడా చెరిపేసినట్లవుతుంది. ఇదే జగన్ లో మిస్ అయిన ఆ ఒక్కటి .