సాక్షి మీడియా ఎవరిది…?
సాక్షి అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిది అని.. లేకపోతే ఆయన సతీమణి వైఎస్ భారతిది అని. మీరేంటీ సాక్షి ఎవరిది అని అడుగుతున్నారు అని ఆలోచిస్తున్నారా..?. అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సాక్షి మీడియాకు ప్రభుత్వం తరపున ఇచ్చిన ప్రకటనల ఖర్చుపై విచారణ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది..
సుమారు ఆరు వందల కోట్లకు పైగా ప్రజాధనం వృధా అయింది వారి ఆరోపణ.. అంతే ఆరోపించినట్లుగా విచారణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో సాక్షి మీడియా కౌంటర్ ఇచ్చింది.. సాక్షి మీడియాకు వైఎస్ భారతికి సంబంధం లేదు .. కేవలం చైర్ పర్శన్ కాదు.. డైరెక్టర్ కాదు అని తేల్చి చెప్పింది.
మరి సాక్షి మీడియాకు వైఎస్ భారతికి సంబంధం లేకపోతే మరెందుకు చైర్ పర్శన్ గా ఉన్నారు. ఐదేండ్ల వైసీపీ పాలనలో ప్రభుత్వం ఎందుకు ఎక్కువగా ప్రకటనలు సాక్షి మీడియాకు ఇచ్చారు.. సాక్షి మీడియా బాధ్యతల నుండి ఎప్పుడు వైఎస్ భారతి తప్పుకున్నారు అని ఇలా పలు ప్రశ్నలు కండ్ల ముందు కదలాడుతున్నాయి. వీటిన్నంటికి కాలమే సమాధానం చెప్పాలి మరి..?