స్త్రీ ఒక శక్తి.. మౌనం పెనుప్రమాదం

Kushboo Indian politician and actress
ఓ మహిళ మౌనాన్ని తేలికగా తీసుకోవద్దు.. స్త్రీ ఓ శక్తి.. ఆమె మౌనం పెను ప్రమాదం అని అన్నారు సీనియర్ నటి.. అలనాటి హీరోయిన్.. తాజాగా జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలు ఖుష్బూ. చిత్రపరిశ్రమలోనే కాదు పని చేసే ప్రతిచోట మహిళలకు రక్షణ లేకుండా పోతుంది.
ఇండియన్ చిత్ర పరిశ్రమలో మహిళ నటులు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై ఆమె స్పందించారు. ఆమె స్పందిస్తూ ” స్త్రీ వ్యక్తిత్వాన్ని చూసి బలహీనురాలిగా చూడోద్దు. ఆమె ఓ శక్తి.. అతీతమైన శక్తి తన సొంతం అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోని మసులుకోవాలి.
మహిళలను వేధించేవారు… అసభ్యంగా మాట్లాడేవారు.. స్త్రీలను తక్కువగా చూసేవాళ్లు ఆమె నేర్పే పాఠాలను జీవితాంతం గుర్తుంచుకుంటారు.. ఆమె గురించి ఒక్క మాట మాట్లాడాలనుకున్న కానీ వణుకుతారు అని ఆమె వ్యాఖ్యానించారు.