జానీ మాస్టర్ పై జనసేనాని కీలక నిర్ణయం…?
జానీ మాస్టర్ అంటే వృత్తి ఫరంగా స్వయంగా కష్టపడి కొరియోగ్రాఫర్ స్థాయికి ఎదిగారు.. రాజకీయాల్లో స్వతహాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో జనసేన పార్టీకి మద్ధతుగా నిలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేనకు మంచి ఊపు తెచ్చిన పాటలో ఆయనే కోరియోగ్రాఫర్ గా చేయడం కాదు ఆయనే నటించి ఇటు జనసైనికులను అటు ప్రజలను జనసేనవైపు నడిపించేలా చేశారు. ఇటీవల జనసేనలో అధికారకంగా చేరుతున్నట్లు జనసేనాని చేతుల మీదుగా కండువా కప్పించుకోని పార్టీ తీర్ధ పుచ్చుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.
తాజాగా జూనియర్ కోరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించారు.. నార్సింగ్ లో జానీ మాస్టర్ నివాసంలో దాడి చేశాడని రాయదుర్గ పీఎస్ లో కేసు పెట్టింది.. తర్వాత ఆధారాలున్నయంటూ నార్సింగ్ పీఎస్ కు ఆ కేసును తరలించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. అయితే రాజకీయంగా కానీ సినీ ఫరంగా కానీ ఎదుగుతున్నప్పుడు ఇలాంటి సంఘటనలపై ఆరోపణలు రావడం సహాజమే కానీ అత్యాచార యత్నమే కాకుండా భౌతిక దాడి జరిగిందని సదరు యువతి ఆధారాలున్నాయని చెప్పడంతో ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల టీడీపీకి చెందిన సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై ఇలాగే ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేయగా టీడీపీ ఆధినాయకత్వం సదరు ఎమ్మెల్యేను పార్టీ నుండి సస్పెండ్ చేసింది.. మళ్లీ కేసులు పెట్టి ఆ కేసును విచారించే పనిలో ఉంది. తాజాగా జనసేనాని ఇదే బాటలో నడుస్తూ కేవలం ఆరోపణలే కాబట్టి జానీ మాస్టర్ ను జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిందిగా ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేసింది.