బాబు కంటే వెనకబడిన జనసేనాని
పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి…. టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడటానికి కీలకభూమిగా వ్యహరించిన నాయకుడు.. అధికారంలోకి కూటమి రావడానికి ప్రధాన కారకుడు. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా కానీ ఓ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు కంటే వెనకబడిపోయారు. ఉపముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాతి స్థానం.. ప్రోటోకాల్ విషయంలో ముఖ్యమంత్రితో సమానం. అయితే మాత్రం ఆ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ వెనకబడే ఉన్నారు. ఏపీని ముంచెత్తిన వరదల విషయంలో బాధితులకు సహాయర్థం దాతలు భారీగా విరాళాలు అందజేస్తున్నారు.
దాతలందరూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కల్సి తమ విరాళాలను అందజెస్తున్నారు తప్పా ఉపముఖ్యమంత్రి పవన్ ను మాత్రం ఎవరూ కలవడం లేదు. అఖరికి తమ మెగా కుటుంబానికి చెందిన సాయిధరం తేజ్ సైతం మంత్రి లోకేశ్ ను కల్సి ఫోటో దిగారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయాలకు దూరంగా ఉన్నారు. ఇలా ఎందుకు ప్రోటోకాల్ దూరం పెడుతున్నారో ఆర్ధం కావడం లేదని జనసైనికులతో పాటు రాజకీయ విశ్లేషకులకు అంతుపట్టని పదార్ధమైంది.
ఒకవేళ బాబే రాజకీయంగా పవన్ ను తక్కువ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా అని వారు తమ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైన కానీ పవన్ కళ్యాణ్ ఓ మంత్రిగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు తప్పా ఉప ముఖ్యమంత్రిగా మాత్రం ఆ ప్రోటోకాల్ ను పాటించడంలో .. అధికారాన్ని వ్యవస్థలను వాడుకోవడంలో.. పార్టీ ఫరంగా తన ఫరంగా బలపడటంతో బాబు కంటే జనసేనాని వెనకబడ్దారు అని జనసైనికులు,రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.