ఎన్నికలకు ముందే సర్పంచ్ ఏకగ్రీవం

 ఎన్నికలకు ముందే సర్పంచ్ ఏకగ్రీవం

తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రాలేదు. కానీ ఆ గ్రామంలో మాత్రం సర్పంచ్ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మూడు గుళ్లు కట్టించి, గడపకో రూ.వెయ్యి పంచేందుకు సిద్ధమైన అభ్యర్థికి ఊరోళ్లంతా జై కొట్టారు. అగ్రిమెంట్లసిన అనంతరం విజయోత్సవ వేడుకలు కూడా జరుపుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో ఈ ఘటన జరిగింది.

చెరువుకొమ్ము తండాలో దాదాపు 883 మంది జనాభా, 700 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, తనను సర్పంచ్గా ఏకగ్రీవం చేస్తే సొంత పైసలతో ఊరిలో బొడ్రాయి, పోచమ్మతల్లి, ఆంజనేయుడికి మూడు గుళ్లు కట్టిస్తానని, విగ్రహాలు పెట్టిస్తానని, బొడ్రాయి పండుగ ఖర్చు కోసం గడప గడపకు రూ.1000 చొప్పు పంచుతానని దరావత్ బాలాజీ అనే వ్యక్తి ముందుకొచ్చాడు.

ఇందుకోసం వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఎవరూ పోటీచేయకుండా, తనను ఏకగ్రీవం చేయాలని కండిషనెపెట్టాడు. దీనికి ఒప్పుకున్న గ్రామస్తులు..సర్పంచ్ఐయ్యాక మాట తప్పితే ఎలా అని ప్రశ్నించారు. దీంతో ఎన్నికలు రాకముందే ఈ పనులన్నీ పూర్తిచేస్తానని దరావత్ బాలాజీ మాట ఇచ్చారు. దీంతో సోమవారం ఊరోళ్లంతా గ్రామంలో మీటింగ్ పెట్టి అగ్రిమెంట్ పేపర్ రాసుకొని.. సర్పంచ్ అభ్యర్థి, గ్రామస్తులతో సంతకాలు పెట్టించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *