మంత్రి అనిత ఆదేశం..?
ఏపీ హోం మంత్రి అనిత తాడేపల్లిలోని డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్యాలయంలో నీటి ప్రవాహంపై సంబంధితాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి అనిత మాట్లాడుతూ ” విజయవాడలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో అన్ని విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవ్వాలి.
వరదల వల్ల వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతిక్షణం చూస్కోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోని ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆమె ఆదేశించారు. ఎప్పటికప్పుడు పైనుండి వచ్చే వరద ప్లోను.. కురుస్తున్న వర్షాలను అధికారులు అంచనా వేయాలి.
దానికి అనుగుణంగా మిగిలిన శాఖలను అధికారులు అప్రమత్తం చేయాలి. ప్రకాశం బ్యారేజీతో పాటు బుడమేరు కు వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు వరద ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లను చేయాలి అని ఆమె ఆదేశించారు.