అనితక్కా … ఏంది నీ తిక్క..?

Minister Anita’s counter to YCP leaders..!
ఏపీలో గణేష్ మండపాలకు అనుమతుల కోసం కూటమి ప్రభుత్వం ఇటీవల సింగిల్ విండో విధానాన్ని తీసుకోచ్చిన సంగతి విధితమే. అయితే మైక్ పర్మిషన్ కు ,గణేష్ విగ్రహాం ఎత్తును బట్టి చలాన్లు కట్టాల్సి ఉంటుంది అని హోం మంత్రి అనిత చెప్పడం ఎంతగా వివాదస్పదమైందో మనం చూశాము .
మైక్ పర్మిషన్ కోసం రోజుకి రూ.100, ఎకో ప్రెండ్లీ విగ్రహాం ఎత్తు 3-6 అడుగులుంటే రూ.350, ఆరు అడుగులకు పైన ఉంటే రోజుకి రూ.700లు కట్టాలని ఆమె ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరి చెప్పడంతో భక్తులు తీవ్ర అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హోం మంత్రి అనిత వ్యాఖ్యలపై హీరోయిన్… బీజేపీ మద్ధతురాలు మాధవీలత ఫైర్ అయ్యారు.
ఆమె మాట్లాడుతూ ” గణేష్ మండపాల్లో మైక్ పర్మిషన్ కు,విగ్రహాం ఎత్తును బట్టి చలాన్లు ఎక్కడైన కడతారా..?. అనితక్కా .. ఏంది నీ తిక్క ఈ కూటమి ప్రభుత్వంలో మా పార్టీ ఉన్నప్పటికి తప్పును ఖండిస్తాను. ప్రతివాళ్లకు హిందు పండుగలపై పడి ఏడవడం తప్పా వేరే పని లేదా.?. మైక్ పర్మిషన్ రూ.100, విగ్రహాలకు రూ.350లు ఇవ్వాలా..?. ఇదే రూల్ క్రిస్టియన్లు,ముస్లీంలకు పెట్టండి” అని హీరోయిన్ మాధవీ లత ఫైర్ అయ్యారు.