మంత్రి నిమ్మల రామానాయుడు పై ప్రశంసల వెల్లువ

 మంత్రి నిమ్మల రామానాయుడు పై ప్రశంసల వెల్లువ

ఏపీ జలవనరుల శాఖ మంత్రి..పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.. గత వారం రోజులుగా వరదలతో.. వర్షాలతో విజయవాడ ఎంతగా అతలాకుతలం అయిందో మనకు తెల్సిందే..

బుడమేరు వాగు వల్లనే ఈ విపత్తు అని అందరూ అంటున్నారు.. ఈ నేపథ్యంలో ఆ వాగు మూడు చోట్ల గండి కీ గురైంది.. దీంతో జలవనరులశాఖ మంత్రి నిమ్మల విజయవాడను ముంచేసిన బుడమేరు వాగు గండ్లను పూడ్చేందుకు గత 6 రోజులుగా గట్టుపైనే ఉన్నారు.

ఎంత భారీ వర్షాలు వచ్చిన ,భారీ వరదలను సైతం లెక్క చేయకుండా పనులను పర్యవేక్షిస్తూ, సిబ్బందికి మంత్రి సూచనలిచ్చారు. ఆకస్మిక వరద వచ్చినా తట్టుకునేలా గట్లను బలోపేతం చేస్తున్నామని ఆయన తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *