గణేశుడ్ని పూజించే పత్రిలు ఎన్నో తెలుసా..?
వినాయక చవితి రోజున గణపతిని మొత్తం ఇరవై ఒక్క రకాల పత్రిలతో పూజిస్తారు. మాచీ పత్రి (మాచిపత్రి), బృహతీ (ములక), బిల్వ (మారేడు), దూర్వ (గరిక), దత్తూర (ఉమ్మెత్త),బదరీ(రేగు),అపామార్గ(ఉత్తరేణీ) , తులసీ, చూత (మామిడి).
కరవీర (గన్నేరు), విష్ణుక్రాంత (శంఖపుష్పం), దాడిమీ( దానిమ్మ), దేవదారు, మరువక (ధవనం ,మరువం), సింధువార (వావిలి), జాజి (జాజిమల్లి), గండకీ పత్రం (కామంచి), శమీ (జమ్మి),అశ్వత్థ(రావి), అర్జున (తెల్ల మద్ది), అర్క (జిల్లేడు) లాంటి ఇరవై ఒక్క పత్రాలతో పూజిస్తారు.