వినాయక చవితి రోజు చంద్రుడ్ని ఎందుకు చూడకూడదు..?

Ganesh Chaturthi Festival
వినాయక చవితి రోజు చంద్రుడ్ని చూడకూడదు.. చూస్తే నీలాపనిందల పాలవుతారని పెద్దలు చెబుతుంటారు. మరి ఆరోజు ఎందుకు చూడకూడదు..?. చూస్తే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఒకరోజు వినాయకుడు పలు రకాల పిండి వంటలు ,ఉండ్రాళ్లు తింటాడు. మరోచేతిలో కొన్నింటిని పట్టుకుని భుక్తాయాసంతో ఇంటికి చేరుకుంటాడు.
ఆ సమయంలో తన తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుందామని వంగడానికి ప్రయత్నిస్తాడు.అయితే రకరకాల పిండి వంటలు తినడంతో పొట్ట బిర్రుగా ఉండి వంగలేకపోతాడు. నానా అవస్థలు పడుతుండటంతో పొట్ట పగిలి కుడుములు అన్నీ బయటికి వచ్చాయి. శివుడి తలపై ఉన్న చంద్రుడు అది చూసి పకపక నవ్వాడు.దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి చంద్రుడ్నిశపించింది.
దీంతో ఎవరైనా చంద్రుడ్ని చూస్తారో వాళ్లు నీలాపనిందలు పడాల్సి వస్తుందని శపిస్తుంది. దేవతలు విషయం తెలిసి వేడుకోగా భాద్రపద చతుర్థి రోజు వినాయకుడ్ని పూజించి అక్షింతలు ధరించిన తర్వాత చంద్రుడ్ని చూడోచ్చని చెబుతుంది. దృక్ పంచాంగం ప్రకారం గణేశ్ చతుర్థి రోజున పొరపాటున చంద్రుడ్ని చూస్తే నీలాపందల నుండి బయటపడేందుకు “సింగ్ ప్రసేనాంవధిత్సింఘో జాంబవత హతః . సుకుమారాక్ మరోదిస్తవ హ్యేష స్యమంతకః ” అనే మంత్రాన్ని జపించాలి.