జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి
తెలంగాణ ఉద్యమ నాయకుడు.. బీఆర్ఎస్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో 1972 డిసెంబర్ 14న జన్మించిన జిట్టా తెలంగాణ ఉద్యమంలో.. సాధనలో ఆయన పాత్ర అమోఘం.. ఎక్కడ ఏ చిన్న ఉద్యమం జరిగిన కానీ అక్కడ ప్రత్యేక్షమై తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలసమస్యలపై పోరాడుతూ తనకున్న కోట్ల ఆస్తులను అమ్ముకున్నారు. తెలంగాణ వచ్చిన రోజు భువనగిరి కోటపై రాష్ట్రావతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తన చివరి కోరిక ఎమ్మెల్యే కావాలని.. చట్టసభల్లో అడుగు పెట్టాలని ఎన్నో సార్లు చెప్పిన జిట్టా ఆ కోరిక నెరవేరకుండానే కన్నుమూయడం బాధాకరం.