హీరో బాలకృష్ణ భారీ విరాళం

 హీరో బాలకృష్ణ భారీ విరాళం

Balakrishna Tollywood Star Hero

Loading

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భారీ విరాళాన్ని ప్రకటించారు. భారీ వర్షాలతో వరదలతో కష్టాల్లో ఉన్న ఏపీ తెలంగాణ లోని వరద బాధితులకు ప్రస్తుతం మనమంతా అండగా నిలబడాల్సిన సమయం ఇది.

కష్టాల్లో ఎవరూ ఉన్న కానీ మానవతాదృక్పధంతో సాయం చేయాలి. అందుకు నా వంతుగా కోటి రూపాయలని విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి యాబై లక్షలు.. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో యాబై లక్షలు అందజేస్తాను అని ఆయన తెలిపారు.

మరోవైపు ఏపీ ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ప్రకటించిన కోటి రూపాయలతో పాటు రాష్ట్రంలో వర్షాలు వరదలతో నష్టపోయిన నాలుగు వందల గ్రామ పంచాయితీలకు లక్ష చొప్పున నాలుగు కోట్ల రూపాయలను ప్రకటించిన సంగతి తెల్సిందే..

నేరుగా ఈ మొత్తాన్ని ఆ పంచాయితీల అకౌంటుకు ట్రాన్సఫర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పీఎస్ ను ఆదేశించనున్నట్లు జనసేనాని తెలిపారు. మరోవైపు తెలంగాణకు కూడా కోటి రూపాయలు ప్రకటించారు పవన్.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *