” హైడ్రా” కూల్చివేతలపై కేంద్ర మాజీ మంత్రి ఆవేదన
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు.. నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెల్సిందే.. సామాన్యుల దగ్గర నుండి సినీ రాజకీయ ఇలా రంగంతో సంబంధం లేకుండా FTL,బఫర్ జోన్లలో ఉన్న అక్రమ కట్టడాలను.. నిర్మాణాలను హైడ్రా నోటీసులు ఇచ్చి మరి కూల్చివేస్తుంది.
ఈ క్రమంలో కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు తన సోదరుడు ఆనంద్ కు చెందిన స్పోర్ట్స్ విలేజ్ ను హైడ్రా అధికారులు ఇటీవల కూల్చివేశారు. దీనిపై కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు స్పందిస్తూ ” తన సోదరుడి స్పోర్ట్స్ విలేజ్ ను అక్రమంగా కూల్చివేశారు.
అన్ని అనుమతులతోనే దాదాపు ఏడు ఎకరాలను లీజుకు తీసుకుని ఓఆర్ఓ ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. 2015నుండే ఇది నిర్వహణలో ఉంది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా హైడ్రా కూల్చివేయడం చాలా బాధాకరం.. ప్రజాజీవితంలో ఎలాంటి మచ్చలేకుండా పనిచేసిన తమపై ఇలాంటి ఆరోపణలు రావడం దారుణం అని ఆయన ఎక్స్ వేదికగా రాసుకోచ్చారు.