సెప్టెంబర్ 7 నుండి మద్యం దుకాణాలు బంద్
వచ్చే సెప్టెంబర్ నెల ఏడో తారీఖు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేయాలని నిర్ణయించినట్లు ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రకటించారు.
మద్యం దుకాణాల్లో పని చేసే కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు.
గత వైసీపీ ప్రభుత్వం తమను ఇంటర్వూ ద్వారా ఎంపిక చేసింది.ఇప్పుడు ఆ ఉద్యోగం ఊడిపోయేలా ఉంది అని వారు తెలిపారు. నూతన మద్యం పాలసీ వస్తే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల మంది ఉద్యోగులు రోడ్డున పడతారు.. కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.