పార్టీ మార్పుపై విజయసాయి రెడ్డి క్లారిటీ

 పార్టీ మార్పుపై విజయసాయి రెడ్డి క్లారిటీ

Vijaya Sai Reddy

Loading

వైసీపీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యే…. ఎమ్మెల్సీ… ఎంపీలు పార్టీ మారుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత… రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా పార్టీ మారనున్నారు అని వార్తలు విన్పిస్తున్నాయి.

తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలపై ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అవి కొంతమంది పని కట్టుకుని నాపై చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే.. వైసీపీ శ్రేణుల మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలనే కుట్రలతో ఇలాంటి నిరాధారమైన అవాస్తమైన వార్తలను ప్రసారం చేస్తున్నారు..

నేను నిఖార్సైన వైఎస్సార్సీపీ కార్యకర్తను. విదేయతకు..వినయానికి ప్రతిరూపం నేను.. వైసీపీని వీడాల్సిన అవసరం నాకు లేదు. వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని చివరివరకు పని చేస్తాను” అని ఎక్స్ లో పోస్టు చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *