జై షా కు పాకిస్థాన్ బిగ్ షాక్
ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన బీసీసీఐ సెక్రటరీ జై షా కు దాయాది దేశమైన పీసీబీ బోర్డు బిగ్ షాక్ ఇచ్చింది. ఐసీసీ చైర్మన్ ఎన్నికల్లో మొత్తం పదహారు మంది సభ్యుల్లో పదిహేను మంది సభ్యులు జై షాకు అనుకూలంగా ఓటేశారని నివేదికలు పేర్కోన్నాయి.
అయితే ఒక్క పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఆయనకు ఓటు వేయలేదని ఆ నివేదికలు తెలిపాయి.. షా ఎన్నిక ఏకగ్రీవం కావడంతో పీసీబీ కేవలం ప్రేక్షక పాత్ర పోషించినట్లు వెల్లడించాయి . మరోవైపు జైషా అతి చిన్న వయసులోనే (36ఏండ్లు)ఐసీసీ చైర్మన్ కావడం ఇక్కడ విశేషం..
బీసీసీఐ కార్యదర్శిగా దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ తనయుడు రోహన్ జైట్లీ ఎన్నిక కానున్నట్లు తెలుస్తుంది. జైషా ఐసీసీ చైర్మన్ గిరివైపు కన్నువేయగా… జైట్లీ తనయుడ్ని బీసీసీఐ కార్యదర్శిగా కూర్చోబెట్టనున్నట్లు తెలుస్తుంది.