కుల గణన పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Minister Ponnam Prabhaker
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల నుంచి కులగణన ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందు కోసం జీవో జారీ చేసి రూ.150 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
సాధారణ పరిపాలన విభాగం, పంచాయతీరాజ్, ప్రణాళిక శాఖలలో ఏదైనా ఒక శాఖ ఈ ప్రక్రియను చేపడుతుందని చెప్పారు.
బీసీలకు రిజర్వేషన్లు ఖరారైన మేరకు చట్టం చేసి అమలు చేస్తామన్నారు. పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు.