KCR, హరీష్ రావు ఒత్తిడి వలనే కాళేశ్వరం ఫైల్స్ పై సంతకాలు
TS:- తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి తన్నీరు హరీష్ రావు ల ఒత్తిడి వలనే కాళేశ్వరం ప్రాజెక్టు పైల్స్ పై సంతకాలు చేయాల్సి వచ్చింది అని సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి తెలిపారు..
వారి ఒత్తిడి వల్లే కాళేశ్వరం డిజైన్లు, డ్రాయింగ్ లో ఫైనల్ అప్రూవల్ కు తాను సంతకాలు చేసినట్లు . కాళేశ్వరం కమిషన్ ఎదుట ఆయన నిన్న గురువారం విచారణకు హాజరై కమిషన్ ముందు చెప్పారు…
కాళేశ్వరం ‘ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే తప్పులు జరిగాయి. పైనుంచి ఒత్తిడి వల్ల క్వాలిటీ కంట్రోల్ సరిగా చెక్ చేయలేదు. మేడిగడ్డ ప్రతి డిజైన్ లో సీడీవోతో పాటు ఎల్అండ్ సంస్థ పాల్గొంది’ అని నరేందర్ రెడ్డి తెలిపారు .