ఫార్మా కంపెనీ పేలుడు మృతులకు కోటి రూపాయలు పరిహారం
ఏపీలో అచ్యుతాపురం లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో మ.2.15 గంటలు. బీ షిప్ట్ కు వచ్చినవారు, ఏ షిఫ్ట్ నుంచి వెళ్లిపోయేవారితో కంపెనీ రద్దీగా ఉంది. మూడో ఫ్లోర్లో ఉన్న రియాక్టర్ ఒక్కసారిగా పేలింది.
ఆ ధాటికి అక్కడున్న వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అంతలోనే ఫస్ట్ ఫ్లోర్ శ్లాబ్ కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న ఉద్యోగుల్లో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది చికిత్స పొందుతున్నారు..
ఈ పేలుడులోపేలుడు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు జిల్లా కలెక్టర్ హరిందర్ రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి కూడా పరిహారం ఇస్తాము..కానీ ఎంత మొత్తం అనేది త్వరలో వెల్లడిస్తామని కలెక్టర్ తెలిపారు.