ఏపీలో HCL విస్తరణ
ఏపీలో భారీగా కార్యకలాపాల విస్తరణకు హెచ్సీఎల్ భారీగా సన్నాహాలు చేస్తోంది. తద్వారా 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో హెచ్సీఎల్ ప్రతినిధులు చర్చించారు.
రాష్ట్రంలో విస్తరణ ప్రతిపాదనలకు ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని మంత్రి నారా లోకేష్ ఆ సంస్థ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.