తెలంగాణలో 400కోట్ల కుంభకోణం
బీజేపీకి చెందిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు. అయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన రూ. 3 వేల కోట్ల రూపాయల నిధులను చీకటి టెండర్లు కోట్ చేసి కుంభకోణం చేశారు.
రేవంత్ రెడ్డి తమ్ముడు, బావమరిది కూడా కాంట్రాక్టులో ఇన్వాల్వ్ అయ్యారు.శోధ, గజా, KNR కంపెనీలకు కాంట్రాక్టు పనులు అప్పగించారు. ఎస్టిమెట్లు అన్ని కాంట్రాక్టర్లు తయారు చేసుకొన్నారు.మెగా కృష్ణారెడ్డికి రూ. 1100 కోట్ల రూపాయల పనులు అప్పగించారు.చీకటి టెండర్లు చేసి రేవంత్ బావమరిది సూదిని సృజన్ రెడ్డికి రూ. 400 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులు ఇచ్చారు.
రూ. 600 కోట్లతో అయ్యే పనికి రూ. 1000 కోట్ల రూపాయలుగా ఎస్టిమెట్లు తయారు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేశారు.ఒక్క జీవో పబ్లిక్ డొమైన్ పెట్టడం లేదు. టెండర్ డాక్యుమెంట్స్ పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టడం లేదు.కాళేశ్వరం ప్రాజెక్టు పై ఒక వైపు జ్యుడిషియల్ విచారణ జరుగుతుంటే… అదే మెగా కృష్ణారెడ్డికి రూ. 11 వందల కోట్ల రూపాయల పనులు ఎలా అప్పగించారు? అని అయన ప్రశ్నించారు.