భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రస్తుత భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
తడిచిన విద్యుత్ స్తంభాలను పట్టుకోవద్దు.. తడిచేతులతో స్టార్టర్లు,మోటార్లు స్విచ్ బోర్డులు ముట్టుకోవద్దు. విద్యుత్ లైన్లకు తగులుతున్న చెట్లను సైతం ముట్టుకోవద్దు. చిన్న పిల్లలు కరెంట్ స్తంభాలను తాకనీవ్వకూడదు..విద్యుత్ సంబంధిత పనిముట్లను ముట్టుకోనీవ్వకూడదు.
ఇనుప తీగలపై దుస్తులను ఆరబెట్టకూడదు.ఉరుములు మెరుపుల సమయంలో డిష్ వైర్ టీవీ నుంచి తీసేయాలి. ఉప్పోంగుతున్న వాగులు,చెరువుల ,కాలువల దగ్గరకు వెళ్లకూడదు. చెట్లు,శిధిల భవనాల ,లోతట్టు ప్రాంతాల్లో ఉండకూడదు.
వాహనాల కండీషన్ ను వాటి టైర్ల గ్రిప్ ను ఎప్పటికప్పుడు చెక్ చేస్కోవాలి. వాహానాలను నెమ్మదిగా నడుపుకోవాలి. అత్యవసర సమయాల్లో ,100,108లకు కాల్ చేయాలి.. అత్యవసరం అయితే తప్పా బయటకు అసలు వెళ్లకూడదు.