పవన్ నోట ‘ మనల్ని ఎవడ్రా ఆపేది’..!

pawan kalyan
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా , నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఏఎం రత్నం నిర్మాతగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో పవన్ నోట మరోసారి ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే డైలాగ్ వినిపించింది.
ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీలో గత ప్రభుత్వ హయాంలో తన సినిమాలకు ఎదురైన ఇబ్బందులను ఆయన వివరించారు. తాను హీరోగా నటించిన భీమ్లా నాయక్ మూవీ విడుదల సమయంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా టికెట్ల ధరలపై ఆంక్షలను విధించారని గుర్తు చేశారు. ఆ సినిమా విడుదలైన సమయంలో అందరీ సినిమాలకు టికెట్ల ధరలు వందల్లో ఉంటే నా సినిమా మాత్రం పదిరూపాయలు, పదిహేను రూపాయలు మాత్రమే ఉండేవి. ఆరోజే చెప్పాను మనల్ని ఎవడ్రా ఆపేది అని. ఇది డబ్బు , రికార్డుల గురించి కాదు. ధైర్యం , పట్టుదల గురించి. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది. టికెట్ రేట్లు పెరిగాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.