జాతీయ మీడియాలో రేవంత్ సర్కారు నవ్వుల పాలు..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నివాసంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి అనుచరులుగా.. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు చెందిన నేతలుగా.. కార్యకర్తలుగా భావిస్తున్న ఆరుగురు దాడికి దిగిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు ..రేవతి మృతికి కారణమయ్యారనే నెపంతో ఈ దాడికి దిగినట్లు వారు తెలిపారు. ఇంతవరకూ బాగానే ఉంది.
కానీ నిన్న ఓ ప్రముఖ జాతీయ మీడియా న్యూస్ ఛానెల్ లో నిర్వహించిన ఓ డిబెట్ లో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి .. స్పోక్ పర్శన్ మన్నె క్రిషాంక్ పాల్గోన్నారు. ఈ డిబెట్ లో లైవ్ లో అల్లు అర్జున్ నివాసంపై జరిగిన దాడికి పాల్పడిన నిందితులల్లో ఒకరైన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఏకంగా లైవ్ లో మన్నె క్రిషాంక్ కు కాల్ చేసి బెదిరించడం జాతీయ మీడియాలో చర్చకు దారి తీసింది.
బీఆర్ఎస్ నేత క్రిషాంక్ మాట్లాడే సబ్జెక్టు అక్కడ లైవ్లో ఉన్నవారితో పాటు అది చూస్తోన్న ప్రతి ఒక్కరికి ఆర్ధమవుతుంది. కానీ అధికార కాంగ్రెస్ పార్టీకి చెంది ఉండి.. ఒకపక్క ఓ కేసులో నిందితుడిగా బెయిల్ పై బయటకు వచ్చి మరి అది లైవ్ లో కాల్ చేసి బెదిరించడం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవస్థలను ఎలా దిగజారుస్తుందో.. తెలంగాణలో పాలన ఎలా ఉందో చెప్పకనే చెబుతుందని సదరు జాతీయ మీడియా ఛానెల్ కరస్పారెంట్ వ్యాఖ్యానించడం చర్చాంశనీయమైంది.ఈ ఘటనతో జాతీయ మీడియాలో రేవంత్ సర్కారు నవ్వుల పాలైంది అని విమర్శలు వెల్లువడుతున్నాయి.