ఆ కారణంతోనే స్కిన్ షో పాత్రలకు నో చెప్పా

6 total views , 1 views today
సాయిపల్లవి చూడటానికి బక్కపలచుగా… అందంగా మన ఇంట్లోనో.. పక్కింట్లోనో ఉండే అమ్మాయిలా కన్పిస్తుంది. చాలా అంటే చాలా నేచూరల్ గా కన్పించే సహాజ నటి.. హీరోలతో పోటి పడి మరి డాన్సులు వేయగల సత్తా తన సొంతం.
అలాంటి నటి గ్లామర్ పాత్రలకు నో చెప్పడానికి గల కారణాలు చెప్పింది ఈ ముద్దుగుమ్మ. జార్జియాలో మెడిసన్ చదువుతున్న సమయంలో ఒకసారి టాంగో డాన్స్ వేశాను. సినిమాల్లో పేరు వచ్చాక ఆ వీడియో తెగ వైరల్ అయింది.
రకరకాల కామెంట్స్ వచ్చాయ్. అవి చదివాక బాధ అన్పించింది. అందుకే స్కిన్ షో పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. మనసుకు నచ్చిన.. ఓ కుటుంబం కూర్చుని చూడగలిగే పాత్రలను ఎంచుకుంటున్నాను అమరన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వూలో సాయిపల్లవి చెప్పుకోచ్చింది.