Cancel Preloader

హైదరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బీసీ నేత…?

 హైదరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బీసీ నేత…?

దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు నగరా మ్రోగిన సంగతి తెల్సిందే.. వచ్చే నెల ఏఫ్రిల్ పద్దెనిమిదో తారీఖున తెలంగాణలో ఉన్న పదిహేడు లోక్ సభ స్థానాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది.. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను ఆ పార్టీ అధినేత..మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు సోమవారం ఖరారు చేశారు..దీంతో మొత్తం పదిహేడు స్థానాలకు గులాబీ దళపతి కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించినట్లైంది.

మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టు

1)ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు(ఓసీ)
2) మహబూబాబాద్ (ఎస్టీ )మాలోత్ కవిత
3) కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్ (ఓసీ)
4 )పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్
5 )మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి (ఓసీ)
6)చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ (బీసీ)
7)వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య
8 )నిజామాబాద్ -బాజి రెడ్డి గోవర్ధన్ (బీసీ)
9 )జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్ (బీసీ)
10 ) ఆదిలాబాద్(ఎస్టీ ) -ఆత్రం సక్కు ( ఆదివాసీ)
11 )మల్కాజ్ గిరి -రాగిడి లక్ష్మా రెడ్డి (ఓసీ)
12)మెదక్ -పి .వెంకట్రామి రెడ్డి (ఓసీ)
13 )నాగర్ కర్నూల్ (ఎస్సీ )-ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ .
14) సికింద్రాబాద్ – తీగుళ్ల పద్మారావు గౌడ్ ( బీసీ)
15) భువనగిరి – క్యామ మల్లేశ్ (బీసీ)
16) నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి (ఓసీ)
17) హైదరాబాద్ – గడ్డం శ్రీనివాస్ యాదవ్ ( బీసీ)

Related post