యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతికి అంకితం

 యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతికి అంకితం

తెలంగాణ రాష్ట్రంలోని  నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ (#YTPS)కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  జాతికి అంకితం చేశారు. నాలుగు వేల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 800 మెగావాట్ల యూనిట్-2 నుంచి వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి, గ్రిడ్‌కు అనుసంధానించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.

అంతకుముందు థర్మల్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారితో కలిసి ఆవిష్కరించారు. ఈ థర్మల్ స్టేషన్‌లోని 800 మెగావాట్ల యూనిట్-2 వద్ద పూజలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర్ రాజనర్సింహ , తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ఎంపీలు రఘువీర్ రెడ్డి , చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *