అంతరిక్షంలో ఎక్కువ రోజులుంటే ఏమవుతుంది..?

అంతరిక్షంలో ఎక్కువ రోజులుంటే ఏమవుతుంది అని చాలా మందికి కొన్ని అనుమానాలు ఉండోచ్చు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండోందల ఎనబై ఆరు రోజుల పాటు సునీతా విలియమ్స్ రోదసీలో ఉన్నారు. మరి అన్ని రోజులు అక్కడ ఉంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందామా..?.
గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల శారీరక శ్రమ ఉండదు. తద్వారా కండరాలు, ఎముకలలో క్షీణత మొదలవుతుంది. భార రహిత స్థితి వల్ల చెవిలోని వెస్టిబ్యులర్ అవయవానికి అందే సమాచారం మారిపోతుంది దీంతో మెదడు సరిగ్గా పనిచేయదు.
శరీరంలోని పైభాగంలో, తలలో రక్తం పేరుకుపోతోంది. తెల్ల రక్తకణాలు తగ్గే ప్రమాదముండటంతో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. అధిక రేడియో ధార్మికత వల్ల దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవ్వచ్చు.
