ఎక్సైజ్ కాలనీలో పర్యటించిన విష్ణువర్ధన్ రెడ్డి…
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 59 డివిజన్ ఎక్సైజ్ కాలనీలో స్థానిక కాలనీవాసుల ఆహ్వానం మేరకు ఈరోజు సాయంకాల వేళ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారి అల్లుడు యువజన నాయకులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు పర్యటించారు.
ఇటీవల కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దృశ్య, కాలనీలో పర్యటించి తమ సమస్యలను పరోక్షంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఆహ్వానించగా ఈరోజు కాలనీలో విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంలో నిర్మాణంలో ఉన్న అంతర్గత రోడ్ల పనులను సైడ్ డ్రైన్ పనులను వారు ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో వారి డివిజన్ అధ్యక్షులు రవి కిరణ్,వెంట డివిజన్ అధ్యక్షులు హనుమకొండ జిల్లా మీడియా & కమ్యూనికేషన్ చైర్మన్ కేతిడి దీపక్ రెడ్డి,నాయకులు తేల్ల సుగుణ కిషోర్,భూపాల్ రెడ్డి,దొంగరి శ్రీనివాస్,కాలని అధ్యక్షులు అశోక్ రెడ్డి,భాను, నారాయణ, ప్రేమకర్ రెడ్డి, నబీన్ అహ్మద్, వసీమ్ మరియు కాలానికి సంబంధించిన ముఖ్య నాయకులు,కాలనీ పెద్దలు తదితరులు ఉన్నారు.