మాజీ ఎంపీ ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

 మాజీ ఎంపీ ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

Loading

ఏపీలో నిన్న సోమవారం మంగళగిరిలో జరిగిన ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర  సీఎం రేవంత్ ఎదుట అద్భుతమైన అవకాశం ఉందని ఉండవల్లి అన్నారు. ‘తెలుగు రాష్ట్రాల మధ్య శాశ్వత అనుబంధాన్ని కల్పించే అవకాశం మీకు వచ్చింది.

సాంకేతికంగా రెండు రాష్ట్రాలే కానీ తెలుగు ప్రజలంతా ఒక్కటే అనే సందేశాన్ని మీరు ఇవ్వాలి. షర్మిలను కలుపుకొని ముందుకెళ్లండి. మీకు వైఎస్సార్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’ అని అయన పేర్కొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *