నేటి నుంచి తిరుమలలో అన్నప్రసాదంలో మసాలా వడ….

ఈరోజు ఉదయం 10.30 గంటల నుండి తిరుపతిలో శ్రీవేంగమాంబ అన్నప్రాసదం లో మసాలా వడ తో భక్తులకు అందుబాటు లో తీసుకురానున్నారు.
ఈ కార్యక్రమాన్ని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభం చేయనున్నారు.టిటిడి చైర్మన్ గా బి ఆర్ నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన భక్తులకు అన్నప్రసాదం లో మసాలా వడ అందుబాటు లోకి తెస్తాం అని హామీ ఇచ్చారు ..
కానీ కేవలం రెండు రోజుల పాటు వడ పంపిణి చేశారు. తరువాత వడ పంపిణి ఆగిపోయింది. దీనిపై పలు విమర్శలు వచ్చాయి. తిరిగి ఈ రోజు నుంచి యధావిధిగా శ్రీవారి అన్న ప్రసాదంలో మసాల వడ అందుబాటు లోకి రానున్నది.
