టిటిడి చైర్మన్ ఫోటో ను వాట్సప్ డీపీగా పెట్టుకుని..?

టీటీడీ మార్చి 7 (సింగిడి)
టీటీడీ చైర్మన్ పిఆర్వో అని చెప్పుకుంటూ శ్రీవారి సేవా టికెట్లు, దర్శన టికెట్స్ తీసిస్తానని భక్తులను ఫరూక్ అనే వ్యక్తి మోసం చేస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.. తాను మోసపోయానని తెలుసుకున్న సదరు బాధితుడు చైర్మన్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు..
చైర్మన్ అదేశంతో ప్రాధమిక విచారణ జరిపి పోలీసులకు టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు పిర్యాదు చేశారు.. దీంతోఫిర్యాదు ఆధారంగా 318(4),319(2),66D సెక్షన్ ల క్రింద నిందితుడిపై కేసు నమోదు చేశారు టూటౌన్ పోలీసులు.
తిరుమల సమాచారం అనే వాట్సాప్ గ్రూపులు ద్వారా భక్తులకు మోసగిస్తున్న వైనం.నిందితుడు నుండి 80వేల నగదు,6 సిమ్ కార్డ్ లు స్వాధీనం చేసుకున్న పోలీసులు..
టీటీడీ అధికారిక వెబ్ సైట్ మినహా మరే ఇతర వెబ్ సైట్ లను ,దళారీలను నమ్మి మోసపోవద్దని భక్తులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు..
