అన్నను ఫాలో అవుతున్న చెల్లె….!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన అన్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ను ఫాలో అవుతున్నారా..?. కేటీఆర్ చేసే ప్రసంగాలను అటు ఇటు చేసి కాపీ కొడుతున్నారా..?. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. అసలు విషయానికి వస్తే మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటివరకూ జరిగిన పలు సమావేశాల్లో.. కార్యకర్తల.. నేతలతో భేటీ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలు.. నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది.
ప్రభుత్వాధికారులై ఉండి.. ప్రజలు చెల్లించే పన్నులను జీతాల రూపంలో తీసుకుంటూ ఓ వర్గానికో.. ఓ పార్టీకో కొమ్ము కాస్తూ బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి వేదిస్తున్నారు. నేను కేసీఆర్ సారంతా మంచోడ్ని కాదు. తప్పకుండా మేము అధికారంలోకి వస్తాము. మా పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టిన అధికారుల పేర్లను.. వేధించేవాళ్లను పింక్ బుక్ లో రాస్తాము. అంతుచూస్తాము అని పలుమార్లు వార్నింగ్ ఇచ్చారు. ఇది తుచా తప్పకుండా అనుసరిస్తున్నట్లున్నారు ఎమ్మెల్సీ కవిత.
ఇటీవల కొద్ది రోజులుగా కామారెడ్డి, జగిత్యాల, నిజామాబాద్, బాల్కోండ ,అర్మూర్ నియోజకవర్గాల్లో పర్యటించిన క్రమంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కేసీఆర్ సారు మంచోడు. కానీ నేను కొంచెం రౌడీ టైప్. రజతోత్సవాలకు వెళ్లకూడదు అని బెదిరిస్తున్నారు..
బీఆర్ఎస్ కోసం పని చేయద్దని అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తూ మా పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారు. వారందరీ పేర్లను పింక్ బుక్ లో ఎక్కిస్తాము. వారందరీ అంతూ చూస్తాము అని మాట్లాడే మాటలు వేరైన ఆర్ధం Same To Same తన ఆన్న కేటీఆర్ మాట్లాడిన మాటలు ఆర్ధం వచ్చేలా మాట్లాడుతూ అన్నను ఫాలో అవుతున్నారు అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
