భారీ వర్షాల కారణంగా వరద మృతుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంచుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం రూ.4లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ప్రస్తుతం వరదలతో అతలాకుతలమవుతున్న ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లకు రూ.5 కోట్లు విడుదల చేసింది. తక్షణ సాయం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులు విడుదల చేశారు.Read More
Tags :singidi news
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు జిల్లాల్లో భారీ వర్షం.. వరదతో వాటిల్లిన నష్టం ప్రాథమిక వివరాలను సీఎం రేవంత్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది.. తక్షణ సహాయక చర్యలు చేపట్టాము.. ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానమంత్రికి […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చి.. చెరువులను ..విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన వ్యవస్థ “హైడ్రా”. గత కొన్ని రోజులుగా నగరంలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు..కట్టడాలు కన్పించిన అక్కడ హైడ్రా ప్రత్యేక్షమై వాటిని కూల్చివేసే పనిలో బిజీబిజీగా ఉంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెగా హీరో.. జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు ట్విట్టర్ వేదికగా మద్ధతుగా నిలిచిన సంగతి […]Read More
బెజవాడకు రెండువైపుల నుంచి ముంపు పొంచి ఉన్నది. ఓవైపు కృష్ణమ్మ మరోవైపు బుడమేరు కాలువ పొంగిపొర్లుతుంది. ఇంకోవైపు గత యాబై ఏండ్ల ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఎన్నడూ లేనంత ఇన్‌ఫ్లో. 11 లక్షల క్యూసెక్కులు దాటి వరద వస్తుంది. 12 లక్షల క్యూసెక్కుల వరద రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజీ నిర్మాణం తర్వాత ఈస్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మరోవైపు బుడమేరు దెబ్బకు విజయవాడ శివారు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 24 […]Read More
ఏపీకి రాజధానిని అమరావతిని చేసి తీరుతాము… దేశానికే ప్రపంచానికి ఆదర్శంగా తీర్చి దిద్దుతాము అని గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఊదరగొట్టిన ఎన్నికల ప్రచారం. తీరా నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలకు అమరావతితో సహా విజయవాడం అంతటా మునిగిపోయింది. ఇండ్లల్లోకి.. కాలనీల్లోకి..హైకోర్టుతో సహా హోం మంత్రి నివాసం ఇలా ఎవరితోనూ భేదాభిప్రాయం లేకుండా అన్నిచోట్ల వరద నీళ్ళు నదులెక్క సముద్రాలెక్క పారాయి. అయితే విజయవాడ మునగకు అసలు కారణం ఏంటో నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడూ […]Read More
ప్రకాష్ నగర్ వద్ద వరదల్లో చిక్కుకున్న 9మందిని ఇప్పటి వరకు రక్షించకపోవడంతో తుమ్మలను చూసి ప్రజలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తుమ్మల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన ప్రజలు. అనంతరం ఆ 9 మందిని కాపాడకుండా ఇంటికి పోనియ్యం అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీద తిరగబడ్డ ఖమ్మం ప్రజలు..Read More
మీది వన్ ప్లస్ ఫోనా..?.. మీ మొబైల్ ఫోన్ 9,10మోడల్స్ కు చెందిన వన్ ప్లస్ ఫోనా..?. అయితే ఈ వార్త మీకోసమే.. మీ ఫోన్ సాఫ్ట్ వేర్ అప్డేట్ అడుగుతుందా..?. అయితే మీరు అప్డేట్ చేస్కోకండి. ఎందుకంటే అప్డేట్ చేయగానే మదర్ బోర్డ్ సమస్య వస్తుంది. ఫోన్ ఒక్కసారిగా ఆగిపోయి సిమ్ కార్డులు పనిచేయట్లేదని పిర్యాదు చేస్తున్నారు వన్ ప్లస్ ఫోన్ వినియోగదారులు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే సాఫ్ట్ వేర్ అప్డేట్ చేస్కోవద్దని టెక్ […]Read More
ప్రస్తుత భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..! తడిచిన విద్యుత్ స్తంభాలను పట్టుకోవద్దు.. తడిచేతులతో స్టార్టర్లు,మోటార్లు స్విచ్ బోర్డులు ముట్టుకోవద్దు. విద్యుత్ లైన్లకు తగులుతున్న చెట్లను సైతం ముట్టుకోవద్దు. చిన్న పిల్లలు కరెంట్ స్తంభాలను తాకనీవ్వకూడదు..విద్యుత్ సంబంధిత పనిముట్లను ముట్టుకోనీవ్వకూడదు. ఇనుప తీగలపై దుస్తులను ఆరబెట్టకూడదు.ఉరుములు మెరుపుల సమయంలో డిష్ వైర్ టీవీ నుంచి తీసేయాలి. ఉప్పోంగుతున్న వాగులు,చెరువుల ,కాలువల దగ్గరకు వెళ్లకూడదు. చెట్లు,శిధిల భవనాల ,లోతట్టు ప్రాంతాల్లో ఉండకూడదు. వాహనాల కండీషన్ ను వాటి […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మద్ధతుగా నిలిచారు మెగా హీరో.. జనసేన నేత కొణిదెల నాగబాబు. రాష్ట్ర రాజధాని మహానగరంలో హైడ్రా కూల్చివేస్తున్న అక్రమ కట్టడాలు. నిర్మాణాలవల్ల ప్రభుత్వ భూములు.. చెరువులు పరిరక్షించబడతాయని నాగబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వర్షాలకు వరదలకు తూములు తెగిపోయి చెరువులు నాలాలు ఉప్పోంగిపోయి అపార్ట్మెంట్లల్లోకి కూడా నీళ్ళు రావడం మనం చూస్తున్నాము. దీనికి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం.. వీటికి ముఖ్య కారణం చెరువులను నాలాలను అక్రమించి […]Read More
తెలంగాణలో గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో రేపు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.. వర్షాలు.. వరదల నేపథ్యంలో స్కూళ్లలో విద్యార్థులకు ఎదురై సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నది.. ఈ నిర్ణయాన్ని తూచ తప్పకుండా అన్ని ప్రైవేట్ ప్రభుత్వ విద్యాసంస్థలు పాటించాలని ఆదేశించింది.మరోవైపు అన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు రేపు సెలవులు రద్ధు చేసింది.Read More
