Tags :breaking news

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో చింతగూడ గ్రామ వాసి…

ఈనెల 27వ తేదీన మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల శాసనమండలి స్థానానికి జరుగనున్న ఎన్నికలో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మేకల అక్షయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈమేరకు గురువారం రోజున కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి గారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో అక్షయ్ కుమార్ వెంట తన మద్దతుదారులు దొడ్డిపల్లి కుమార్, పూదరి శ్రీకాంత్ పటేల్, జాడి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ పై హారీష్ రావు ఫైర్..?

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయహస్తం కాదు, భస్మాసుర హస్తమని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు..లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ములుగు జిల్లా, బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య (నాగేశ్వర్ రావు) గారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు..పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేంద్ర మంత్రి గడ్కారితో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ..!

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు సహచర ఎంపీలు కే.ఆర్.సురేష్ రెడ్డి, దామోదర్ రావు, డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి,మాజీ ఎంపీ బీ.వినోద్ కుమార్,ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తదితర ప్రముఖులతో కలిసి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్ లతో భేటీ అయ్యారు.ఎంపీ రవిచంద్ర మాజీ మంత్రులు కేటీఆర్,సబితా ఇంద్రారెడ్డి, రాజ్యసభలో సహచర సభ్యులు సురేష్ రెడ్డి, దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పదేండ్ల అభివృద్ధి కండ్ల ముందు ..!

పుట్ పాత్ వ్యాపారుల విషయంలో అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలని, ఇబ్బందులు పెట్టవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. గురువారం పద్మారావు నగర్ లోని పార్క్ వద్ద 12.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు, వెంకటాపురం కాలనీలో 42 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులు, 3 లక్షల రూపాయల వ్యయంతో ఎన్టీఆర్ విగ్రహం సమీపంలోని పార్క్ లో చేపట్టనున్న అభివృద్ధి పనులను […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేంద్ర మంత్రి ధర్మేంద్రతో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ..!

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఢిల్లీలో యూజీసీ నిబంధనలు మార్చడంపై కలిశామని మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ మార్పుపై అభ్యంతరం తెలియజేస్తూ ఆయనకు లేఖ ఇచ్చామని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.ఎన్ఎస్ఎస్సీ క్లాజ్ తో రిజర్వ్డ్ వర్గాలకు అన్యాయం జరిగే అవకాశముందని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని ఆయన తేల్చి చెప్పారు. ఉపఎన్నికలు జరగాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని ఈ సందర్భంగా […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జమిలీ ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన పాలన కొనసాగుతోందని వైసీపీ అధినేత.. వైఎస్ జగన్మోహాన్ రెడ్డి దుయ్యబట్టారు. త్వరలో ‘జమిలి ఎన్నికలు వస్తాయంటున్నారు. ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ప్రస్తుత ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబును పంపాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. బాబును చొక్కా పట్టుకొని ప్రశ్నించే రోజులు, తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. బాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేనని పదేపదే చెప్పాను. చంద్రముఖిని మళ్లీ నిద్రలేపి రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు’ అని వైఎస్ జగన్మోహాన్ రెడ్డి […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

విజయసాయి రెడ్డి రాజీనామాపై జగన్ స్పందన..!

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులు.. ఆ పార్టీ సీనియర్ నాయకులు విజయసాయి రెడ్డి రాజీనామాపై పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తొలిసారి స్పందించారు. రాజీనామాపై జగన్ స్పందిస్తూ ‘మాకు 11 మంది రాజ్యసభఎంపీలుంటే సాయిరెడ్డితో కలిపి ఇప్పటివరకు నలుగురు వెళ్లిపోయారు. అయినా వైసీపీకి ఏమీ కాదు. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం. అది సాయిరెడ్డికైనా, ఇప్పటివరకు పోయినవారికైనా, ఇంకా ఒకడో, ఇద్దరో వెళ్లేవారికైనా అదే వర్తిస్తుంది. క్యారెక్టర్ను బట్టే ఉంటుంది. వైసీపీ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఇందులో భాగంగా నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతోన్న క్యాబినెట్ భేటీలో దీనికి ఆమోదం లభించింది. అటు ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోనుంది అని మంత్రివర్గం నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను స్థానిక మంత్రులను […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

స్థానిక ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

మర్రి చెన్నారెడ్డి భవన్ లో జరుగుతున్న సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం చేయాలి. అత్యధిక గ్రామ పంచాయితీలను ఏకగ్రీవం చేయాలి. గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన .. తాగునీటి వసతులు.. సీసీ బీటీ రోడ్ల నిర్మాణం..ఆలయ నిర్మాణాలను సహాకరించాలి. నిధుల కోసం స్థానిక సంబంధిత మంత్రులను కలవాలి.. ప్రజలకు అందుబాటులో ఉండాలి.. పార్టీ నేతలను.. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కులగణన చాలా పారదర్శకంగా జరిగింది..!

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే విజయవంతంగా పూర్తి చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సామాజిక న్యాయం అమలుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే సమాచారాన్ని ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు, సామాజిక పరంగా తీసుకునే నిర్ణయాలకు తప్పనిసరిగా వాడుకుంటామని స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి […]Read More