త్వరలో కాంగ్రెస్ కు షాక్ ట్రీట్మెంట్-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

సంగారెడ్డి జిల్లాలో పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి & టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి శ్రీ మల్క కొమరయ్య కి మద్దతుగా ఎల్ఎన్ కన్వెన్షన్ లో జరిగిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ ” పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చుట్టూ తిరిగింది.
మార్పు మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఇంకా అప్పుల పాలైంది. ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే.హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చేతులు ఎత్తేసింది..
తెలంగాణలో ఆర్థిక సంక్షోభం ఎంతో దూరంలో లేదు.. ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలేదు.. కాంగ్రెస్ సర్కార్‌కు షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలి.. రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయాల్సిన కాంగ్రెస్ దశ దిశ లేకుండా పనిచేస్తుంది.. హామీలు వాళ్లు ఇచ్చి.. హామీల అమలుకు కేంద్రం నిధులు ఇవ్వట్లేదని చెబుతున్నారు . అవన్నీ అబద్ధాలే అని అన్నారు.
