త్వరలోనే సన్నబియ్యం పంపిణీ..!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమ లుకు కసరత్తు చేస్తోంది. అయితే.. ఆరు గ్యారెంటీల అమలు కోసం ఈ నెల 28 నుంచి ప్రజా పాలన పేరుతో గ్రామ సభలు నిర్వహిస్తు న్నామని,మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు ఈరోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రేషన్ కార్డ్ దారులకు సన్న బియ్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటిం చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అన్ని రంగాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణను 10 ఏళ్లు నిర్లక్ష్యం చేశారని, విమ ర్శించారు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాదు ఇప్పుడు టాప్ లో ఉందన్నారు..