సంక్రాంతికి వస్తున్నాం మరో సంచలనం

విక్టరీ వెంకటేశ్ హీరోగా.. మీనాక్షి చౌదరి,ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా దిల్ రాజు సమర్పణలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం..
ఇటీవల సంక్రాంతికి కానుకగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పలు రికార్డులను సొంతం చేసుకుంది. దాదాపు మూడోందలకు పైగా కోట్ల రూపాయలను కలెక్షన్ చేసింది. తాజాగా ఈ చిత్రం జీ5లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ క్రమంలో ఏకంగా 92 కేంద్రాలలో ఇప్పటికీ ఆడుతూ యాబై రోజులను పూర్తి చేసుకుంది. 50వ రోజు నాటికి ఇన్ని కేంద్రాలలో ఓ ప్రాంతీయ చిత్రం థియేటర్లలో ఉండటం ఓ రకంగా విశేషమనే చెప్పాలి. సినిమా ప్రదర్శితమౌతున్న 92 సెంటర్స్ జాబితాను నిర్మాతలు ప్రకటించారు.
