నేను పారిపోలేదు -రామ్ గోపాల్ వర్మ..!
సోషల్ మీడియా లో పోస్టుల గురించి ఏపీ ప్రభుత్వం తనపై పెట్టిన కేసుల విషయంలో ప్రముఖ వివాదాస్పద దర్శకుడు అర్జీవి ట్విటర్లో పాయింట్ల రూపంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘నేను ఎక్కడికీ పారిపోలేదు. ఏడాది క్రితం చేసిన ట్వీట్లపై 2 వారాల క్రితం 4 వేర్వేరు జిల్లాల్లో కేసు పెట్టడం వెనుక ఏదో కుట్ర ఉందనేది నా అనుమానం.
మీమ్స్ పై కేసులు పెట్టాలంటే దేశంలో సగంమందిపై కేసులుంటాయి. మీడియా కాల్స్ భరించలేకే ఫోన్ ఆపేశాను. చట్టాన్ని గౌరవిస్తా. కానీ నా హక్కులు నాకున్నాయి’ అని ట్వీట్ చేశారు.