మురారి మరో రికార్డు

 మురారి మరో రికార్డు

Re-release Murari Movie

Loading

సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మూవీ మురారి.. అప్పట్లో విడుదలై ఎంతో ఘన విజయం సాధించిన చిత్రాల్లో ఇది ఒకటి. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా ఈ మూవీ రీరిలీజ్ అయింది..

రీరిలీజ్ అయిన చిత్రాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా మురారి రికార్డు సృష్టించింది… నైజాం ఏరియాలో తొలి రోజు ₹2.90కోట్లు కొల్లగొట్టింది.. ఇది ఆల్ టైమ్ రికార్డని ప్రిన్స్ అభిమానులు పోస్టులు చేస్తున్నారు.

ఆ తర్వాత మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ (₹2.46కోట్లు ),పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించగా సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషి (₹1.65కోట్లు ),పవన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా (₹1.26కోట్లు ),ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ కాంబో లో వచ్చిన సింహాద్రి మూవీ (₹1.06కోట్లు ) ఉన్నాయంటున్నారు.

మరోవైపు ఆస్ట్రేలియాలో రీరిలీజ్ అయిన తొలి రోజే A$16,290 లను మురారి మూవీ వసూలు చేయడమూ కూడా రికార్డని చెబుతున్నారు..ఆ తర్వాత సింహాద్రి (A$12,164),చెన్నకేశవరెడ్డి 3(A$11,047)లు తర్వాత స్థానాల్లో ఉన్నాయని సినీ క్రిటిక్స్ పేర్కొంటున్నారు

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *